గుంటూరు జిల్లా SP శ్రీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు గుంటూరు East DSP గారు అయిన SK అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో కొత్తపేట, లాలాపేట,పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ మరియు బైక్ రేసుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం అయినది.
ఈ స్పెషల్ డ్రైవ్ లో కొత్తపేట పోలీస్ వారు 5 మోటార్ సైకిళ్ళు,లాలాపేట పోలీస్ వారు 5 మోటార్ సైకిళ్ళు పాత గుంటూరు పోలీసు వారు 7 మోటార్ సైకిళ్ళు సీజ్ చేసినారు. భవిష్యత్తులో ర్యాష్ డ్రైవింగ్ మరియు మోటార్ సైకిల్ రేసులు నిర్వహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనబడును.




