Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందల్ వి వి ఐ పి బందొబస్తూ ఏర్పాట్లు. |

గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందల్ వి వి ఐ పి బందొబస్తూ ఏర్పాట్లు. |

గుంటూరు జిల్లా పోలీస్..
వీవీఐపీ బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, అప్రమత్తతతో, సమన్వయంగా విధులు నిర్వహించాలంటూ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు,./

గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, వెంకటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని (E-4, N-4) రోడ్ జంక్షన్ వద్ద రేపు (25.12.2025) భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనున్నది. 💫 *ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరుకానున్న నేపథ్యంలో, భద్రతా పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించారు.*

ఈ సందర్భంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహణ ప్రదేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా, ఐఏఎస్ గారు, CRDA జాయింట్ కమిషనర్ శ్రీ భార్గవ్ తేజ, ఐఏఎస్ గారితో కలిసి జిల్లా ఎస్పీ గారు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. వీవీఐపీ మరియు వీఐపీ రాకపోకల మార్గాలు, సభా వేదిక, విగ్రహావిష్కరణ స్థలం, భారీ కేడింగ్, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ పికెట్లు తదితర అంశాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 💫 అనంతరం వీవీఐపీ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి విస్తృత స్థాయిలో బ్రీఫింగ్ నిర్వహించారు.

ముఖ్యంగా వీవీఐపీ, వీఐపీల రాకపోకల సమయంలో అప్రమత్తత, సభా ప్రాంగణంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ గారు ఆదేశించారు. 👉 కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర భద్రతా మ్యాప్‌ను ప్రదర్శిస్తూ పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, సభా వేదిక వద్ద బహుస్థాయి భద్రతా ఏర్పాటు, వీవీఐపీ మరియు వీఐపీ మార్గాలు, సభా ప్రాంగణంలోకి ప్రవేశించే వ్యక్తుల నియంత్రణ, అలాగే ప్రజలు, మీడియా ప్రతినిధులు మరియు ఆహ్వానితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించవలసిన విధానాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని స్థాయిల పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, సమాచార వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేలా పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమం శాంతియుతంగా, విజయవంతంగా ముగిసేలా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ఏటీవీ రవికుమార్ గారు (L&O), శ్రీ హనుమంతు గారు (AR), తుళ్లూరు డీఎస్పీ శ్రీ మురళీ కృష్ణ గారు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బీ సీఐ శ్రీ అలహరి శ్రీనివాస్ గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments