చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ,నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు క్రీస్తు ప్రబోధించారు అని, ఆయన బోధ అనుసరించి సమాజం లో ప్రేమను పరిమళ్ళింప చేయుటయే నిజమైన క్రిస్మస్ పరమార్థం అని అన్నారు. అనంతరం వేడుకల్లో భాగంగా గ్రామంలోని పేద మహిళలకు ఆయన తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రైస్తవ మత పెద్దలు మరియు అధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
#నరేంద్ర
