Home South Zone Andhra Pradesh క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కరణం నేతలు |

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కరణం నేతలు |

0

క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.

చీరాల:క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మరియు చీరాల నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ కరణం బలరాం గారు మరియు వెంకటేష్ బాబు గారు శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని కరణం బలరాం గారు పేర్కొన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు.

దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారని తెలిపారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు పేర్కొన్నారు.

#నరేంద్ర

NO COMMENTS

Exit mobile version