కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల వ్యవసాయ శాఖ ఆధరవ్యంలో నిర్వహిస్తున్న దాళ్వా వరి సాగులో భాగంగా నారుమల్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి రైతులకు వివరించాలని సిబ్బందికి సూచించారు..
శంఖవరంలో వరి నారుమళ్ళును సిబ్బందితో పరిశీలించి దృఢమైన.
ఆరోగ్యవంతమైన నారు కోసం ముందుగా నారుమడిని బాగా దున్ని చదును చేసుకుని నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.. దాళ్వాకు అనువైన ఎం టి యు 1153, 1156, పి ఆర్ 126 వంటి రకాలు అనువైనవి అని వివరించారు. నారుమడిలో జింక్ లోపాన్ని అధిగమించడానికి సెంటు నారుమడికి కిలో “జింక్ సల్ఫేట్ ” ఆఖరి దమ్ములో వేయాలని సూచించారు. సెంటు నారుమడికి అర కిలో యూరియా .
1.25 కిలోల సూపర్ పాస్ఫేట్, మూడు సెంట్లకు కిలోల పొటాష్, ఆఖరి దమ్ములో వేయాలని వివరించారు. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను నారుమడిలో చల్లుకోడం ద్వారా ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చని తెలిపారు. ఈ పొలం పిలుస్తుందిరా కార్యక్రమంలో AEO శ్రీనివాస్, వ్యవసాయ ఉద్యాన సహాయకులు సురేష్, సత్యనారాయణ, కాంతి, మణికంఠ, చిన్నారి, ప్రసాద్, శ్యాంసుందర్, సువర్ణరాజు, రాజు, రైతులు పాల్గొన్నారు…
# BABJI DADALA




