Home South Zone Telangana మెదక్ చర్చిల పండుగలకు ₹34 లక్షల మంజూరు |

మెదక్ చర్చిల పండుగలకు ₹34 లక్షల మంజూరు |

0

మెదక్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని చర్చిలకు సెలబ్రేషన్ నిర్వహించుకోవడానికి ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున రెండు నియోజకవర్గాలకు కలిపి రూ.4 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

అలాగే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని వంద చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున రూ. 30 లక్షలు మంజూరు చేసినట్లు ఆ నిధులను ఆయా చర్చిలకు అందచేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం అందచేసిన నిధులతో చర్చిలలో ఫీస్ట్ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

Exit mobile version