*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వే శాఖకు కేటాయించినందుకు మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.*
*గిరిజన జిల్లా అయిన మహాబూబాబాద్ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని,కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఫ్లాంట్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేయాలని,రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని అఖిల పక్ష నాయకులు కోరారు.*
*ఈ ప్రాజెక్టు వల్ల మహాబూబాబాద్ లో రైల్వే అభివృద్ధి కావడమే కాకుండా స్థానిక ప్రజలకు,యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేయడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అఖిలపక్ష నాయకులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.*
