మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యాలయం అంతా చక్కగా క్రిస్మస్ డెకరేషన్లు, రంగురంగుల లైట్లు అలంకరించడం జరిగింది . శ్రీదేవి గారు స్వయంగా క్రిస్మస్ ట్రీని అలంకరిస్తూ, అందరికీ ఉత్సాహాన్నిచ్చారు.వేడుకలో క్రిస్మస్ కారల్స్ గానం,కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.కేక్ కటింగ్ జరుగగా, అందరూ పండుగ ఆహ్లాదాన్ని పంచుకున్నారు.
ఆ వేడుకలు కార్యాలయాన్ని ఒక కుటుంబ వాతావరణంగా మార్చాయి.ఈ సందర్బంగా శ్రీదేవి గారు మాట్లాడుతూ, ఈ పండుగ మన అందరి జీవితాలలో శాంతి, ఆనందం నింపాలని, ప్రేమ, దయ, మానవీయతతో మమేకం కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతమయ్యాయని కృతజ్ఞతలు తెలిపారు.
ఇలా మాదిగ కార్పొరేషన్ ఆఫీస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు అందరికీ ఒక మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాయి.ఉండవల్లి శ్రీదేవి గారు చివరిలో అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు,పాస్టర్ దేవ ప్రకాష్ గారు,మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు,ఎస్సీ కార్పొరేషన్ జిఎం కృష్ణవేణి గారు,కూటమి ప్రభుత్వం కార్యకర్తలు,వుండవల్లి శ్రీదేవి గారి అభిమానులు పాల్గొన్నారు.
