సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు
తనను తాను తగ్గించుకుని మెలగడం పొరుగువారితో ప్రేమ, కరుణ, దయ, ప్రతి మనిషిలోనూ మానవతావాదం పెంపొందించుకుని జీవించాల్సిన అవసరం ఉందని ఏసు తన బోధనల ద్వారా ప్రపంచ శాంతికి చాటి చెప్పారని కొత్తపేట సీఐ కొండలరావు పేర్కొన్నారు*
*ఈ సందర్భంగా సీఐ కొండలరావు కేక్ కటింగ్ చేసి, పోలీస్ సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు*
*ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది ఇలాంటి వేడుకల ద్వారా మరింత ఐక్యతతో విధులు నిర్వర్తించాలని సీఐ ఆకాంక్షించారు*.
*ప్రతి మనిషి తన హృదయాన్ని మందిరంగా మార్చుకోవాలని తోటి* *మనుషులను ప్రేమించే* *తత్వాన్ని అలవర్చుకోవాలని* *కరుణామయుడు తన జీవితాన్ని పొరుగువారి* *కోసం త్యాగం చేసిన* *మహనీయులు, మార్గదర్శకులు* *కోట్లాదిమంది ఆరాధించే యేసు ప్రభువు* *జీవిత సత్యాన్ని గ్రహించి మానవాళి అనుసరిస్తోందని పేర్కొన్నారు*
*శాంతి మార్గంలో మానవులందరూ తమ జీవిత విధానాన్ని కొనసాగించాలని అప్పుడే సమాజం మరింత మంచి మార్గంలో కొనసాగుతుందన్నారు*
*విజయవాడ కొత్తపేట పోలీస్ సిబ్బంది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు*




