సర్పంచ్లకు సీఎం రేవంత్ గుడ్న్యూస్
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణాభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
గ్రామాల పరిమాణాన్ని బట్టి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) నుంచి ప్రత్యేకంగా నిధులు అందజేయనున్నట్లు తెలిపారు.
*చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు*
*పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు*
ఈ నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.




