*ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్.పి* గుంటూరు, డిసెంబరు 24 : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు.
వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా అటల్ స్మృతి వనంను ప్రారంభించనున్నారు. స్మృతి వనంలో అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఎ అదనపు కమిషనర్ భరత్ తేజ, అదనపు ఎస్పీలు హనుమంతు, ఏ.టి.వి రవి కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసిల్దార్ హరి బాబు, సి.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
