మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం నియోజకవర్గం లోని న్యూ బోయిన్ పల్లి హనుమాన్ కో ఆపరేటివ్ సొసైటీ అయ్యప్ప స్వామి దేవాలయం, మడ్ ఫోర్డ్ తుల్కంతమ్మన్ దేవాలయాలలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమాలలో పాల్గొని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు.
ఈ పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, బల్వంత్ రెడ్డి, గణేష్ టెంపుల్ ఛైర్మన్ ప్రభాకర్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్,మధు, శేఖర్ తదితరులు ఉన్నారు.
#sidhumaroju




