*కరుణ చూపడమే క్రీస్తు సందేశం* – గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ సర్వ మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు సకల మానవాళికి అనుసరణీయమని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ విజయ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమ, కరుణకు తార్కాణంగా సాగిన క్రీస్తు జీవన గమనం నేటికీ అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటివి మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని తెలిపారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు. క్రీస్తు సందేశాన్ని అర్థం చేసుకుని అంతా ఐకమత్యంతో మెలుగుతూ.. ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బత్తుల దేవానంద్, ముత్యం , పానుగంటి చైతన్య, జ్యోతి బాబు, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), బూసి రాజలత, కొరిటిపొటి ప్రేమ్ కుమార్, వెలుగూరి రత్న, గనిక జాన్సీ, భాగ్యరావు, ఆలా కిరణ్, గంగాధర్ రెడ్డి, పాస్టర్స్ బాలశౌరి, గిడియోన్ తదితరులు పాల్గొన్నారు.






