కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో “క్రిస్మస్” వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు RCM చర్చ్, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్, ఇంకా అనేక చర్చ్ లు అందమైన రంగులతో, మిరుమిట్లు గొలిపే లైటింగుతో ఎంతో అందంగా ముస్తాబు చేయడం జరిగింది…
క్రిస్మస్ రోజు ముందుగా రాత్రికి సంఘస్తులు, చిన్నారులు, విశ్వాసులతో కలిసి గ్రామంలో ప్రతీ వీధిలో క్రిస్మస్ క్యారెల్స్ నిర్వహించి దేవుని పాటలతో, ఆశీర్వాద ప్రార్థనలతో చర్చ్ లో జరిగే క్రిస్మస్ వేడుకకు రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది..
యేసుక్రీస్తుని పుట్టిన దినాన వందలాది విశ్వాసులు ఎంతో భక్తితో కొత్తబట్టలు కట్టుకుని, చిన్నారులు నేర్చుకున్న అందమైన నృత్యాలను, నాటికలను ప్రదర్శించడం జరుగుతుంది… తర్వాత సంఘ దైవసేవకులు (పాస్టర్) ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశాన్ని అందించి, ప్రతీ ఒక్కరిపైన ప్రేమ, శాంతి, ఆనందం కలిగి ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు సంఘస్తులపై, ప్రజలపై ఎల్లపుడూ దేవుడు కాచి కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.
సంతోషాలు నడుము “క్రిస్మస్ కేక్” కట్ చేసి ఎంతో వైభవంగా వేడుకలు జరుపుకుంటామని, ఈ వేడుకలు RCM చర్చ్ వారు 25 సంవత్సరాలనుండి, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్ వారు 40 సంవత్సరాలనుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని దైవసేవకులు తెలియజేయడం జరిగింది.
# BABJI DADALA
