*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం – గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం – మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *
*ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు .
కూటమి నాయకుల వేధింపులు తాళలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను నేడు వారి ఇంటికి వెళ్లి పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పరామర్శించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ మేకల గోపి మృతి చాలా బాధాకరం, గోపి
కుటుంబానికి నంబూరు శంకరరావు ఆర్థిక సహాయం చేశారు పిల్లల చదువుకు మరియు పార్టీ తరుపున అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై కూటమి నాయకులు వేధింపులకు గురించేస్తున్నారన్నారు.
గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉండకుండా వేధింపులతో గ్రామం నుండి వెళ్లగొడుతున్నారని అన్నారు. రాజకీయం అంటే ప్రజలకు దగ్గర అవ్వలి కానీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు అని తెలిపారు. ఇప్పటికి అయిన పద్ధతి మార్చుకొని ప్రజా పాలన కొనసాగించాలని, నియోజకవర్గం అభివృద్ధి చేయాలనీ సూచించారు.
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు దైర్యం గా ఉండాలని, ఎటువంటి ఆగాయిత్యాలకు పాల్పడవద్దని, మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు.




