Friday, December 26, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి |

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి 101వ జయంతి ఉత్సవాలను అల్వాల్ మెయిన్ రోడ్డు మీసేవ కూడలి వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది.
సందర్భంగా వారు మాట్లాడుతూ…

భారతదేశానికి సేవ చేసిన గొప్ప నాయకుడు. దార్శనికుడు, కవి, రచయిత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి  జయంతి సందర్భంగా, ఆయనకు ఆల్వాల్ భారతీయ జనతా పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము.
వాజ్‌పేయి  తన జీవితాన్ని దేశం, ప్రజల కోసం అంకితం చేశారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో పొఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధంలో దేశాన్ని విజయతీరాలకు చేర్చడం, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధికి నాంది పలకడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనం. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేసే చతురత, రాజకీయ దృఢ సంకల్పం, విలువలతో కూడిన పాలన ఆయన సొంతం.

అటల్ బిహారీ వాజ్ పేయి భారతదేశ ప్రధానిగా మొదటిసారి 13 రోజులు ప్రధానమంత్రిగా రెండవసారి 13 నెలల మంత్రిగా ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ ఇతర పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది.
వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా చైనా లాంటి అగ్రదేశాలు భారత్ కి వ్యతిరేకంగా పాకిస్థాన్ ను సమర్ధిస్తున్నప్పటికీ వాజపేయి  చాతృతతో అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా చైనాలకు దీటైన జవాబు ఇస్తూ కార్గిల్ యుద్ధాన్ని విజయవంతం చేయడంలో తన ధీరత్వానికి ప్రదర్శించారు.

తన పదవీకాలంలో దేశం గర్వించేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, జనసంఘ్ నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయనకు భారతరత్న పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి.
అటల్ బిహారీ వాజ్‌పేయి 101 వ జయంతోత్సవాన్ని స్మరించుకుంటూ, సుపరిపాలన దినోత్సవ సందర్బంగా పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత, మరియు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండటమే సుపరిపాలన లక్ష్యాలని, ఈ విలువలను పెంపొందించుకుంటూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ 101వ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్లో నాగిరెడ్డి కాలనీ చౌరస్తాలో అటల్ బిహారీ వాజ్ పేయి  విగ్రహ ఏర్పాటుకు నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
అటల్ బిహారి వాజ్ పేయి  ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఆయన చేసిన నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ BJP నాయకులు పరంకుశం మాధవ్. నిమ్మ కృష్ణారెడ్డి శేఖర్, సంతోష్ గౌడ్ వెంకటేష్ మల్లికార్జున గౌడ్ చింతల మాణిక్య రెడ్డి, మురళి క్రిష్ణ, మోయ సుజాత, శ్రీనివాస వర్మ, రామ్మోహన్ గౌడ్, అజయ్ రెడ్డి, కార్తీక్ గౌడ్, తూప్రాన్ లక్ష్మణ్, మల్లికార్జున్ యాదవ్, రాజిరెడ్డి, ప్రదీప్,మహేష్, స్రవంతి, భరత్ చౌదరి, అనిల్, అనిల్ రాజ్,, రామ్ సింగ్, నాగి, నాగరాజు, ముఖేష్, నీలం శ్రీనివాస్, చంద్రకాంత్ చరణ్, అనిల్, రవిశంకర్, రవి, జనార్ధన్, శ్రీధర్, రాజు  లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments