Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneTelanganaడాక్టర్ రాజు(కూర రాజు ) |

డాక్టర్ రాజు(కూర రాజు ) |

కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా

తెలంగాణలో 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు

మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు ఈ నిధులు అదనమని స్పష్టం

కోడంగల్ కు సైనిక్ స్కూల్ తీసుకొస్తున్న

2029లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని కోడంగల్ నుండి కెసిఆర్ కు సవాల్

భారత్ అవాజ్ తెలంగాణ కోడంగల్

నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అధితిగ హాజరైన ముఖ్యమంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం చేసారు.అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సర్పంచులకు వరాల జల్లులు కురిపించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు అదనంగా మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు.

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి అందిస్తామని ఈ నిధులు ఎమ్మెల్యే ఎంపీ లకు ఎవ్వరికి సంబంధం లేకుండా డైరెక్ట్ గ ముఖ్యమంత్రి సహాయానిది నుండి గ్రామ పంచాయతీలకు ఈ నిధులు స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌గా అందజేస్తామని చెప్పారు.ఈ ప్రత్యేక నిధులు నూతన సంవత్సరంలో అందజేస్తామని తెలిపారు.ఈ ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల్లో
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ సర్పంచులకు ప్రజల్లో గౌరవం,మర్యాద పెంచుతుందని.

చెప్పారు.సర్పంచులు గ్రామ సభలు పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని,గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వం సర్పంచులకు అండగా ఉంటుంది అని మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి రావలసిన ౩ వేల కోట్ల రూపాయలను తెప్పించే బాధ్యత తీసుకుంటాఅని గ్రామ సభలు పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకుని .

అభివృద్ధి చేసుకోవాలి అని అన్నారు.ఎన్నికలు ముగిసాయి పార్టీలు పంథాలు ఎన్నికల సమయంలోనే ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే ఎవరి పట్ల వివక్ష చూపరాదు వాడు చెబితే వినలేదనో, ఎన్నికల్లో పోటీ చేశారనో ప్రత్యర్థులు గెలిచారు అనే కారణంగా గ్రామాల్లో ఎవరి పైన వివక్ష చూపించోద్దు చిన్న చిన్న అభిప్రాయబేధాలు ఉంటే పక్కన పెట్టి కలికట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.

రాష్ట్రంలో పెండింగ్ వున్నా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నాం.గత ప్రభుత్వంలో చేసిన 8 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నాం. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు – రంగారెడ్డి, మక్తల్‌ – నారాయణపేట ప్రాజెక్టులేవీ గత పదేళ్లలో పూర్తి చేయలేదు. చుక్క నీరివ్వలేదు వాటన్నింటినీ చేపడుతాం.చదువు ఒక్కటే నిరుపేదల జీవితాలను మార్చగలదు.

అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించే కార్యక్రమం చేపట్టబోతున్నాం.పేదలకు నాణ్యమైన విద్య,ఉన్నత ప్రమాణాలు కల్పించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారుఅని ప్రజలు ఆశీర్వదించడంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నాం గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్‌ కార్డులు ఇచ్చాం మారుమూల గ్రామాల్లో ఇంకా ఎవరికైనా రాకపోతే సర్పంచులు వారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకొస్తే రేషన్ కార్డులు రాని వారికి ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది.

అర్హులైన ప్రతి పేద వాడికి సన్నబియ్యం అందాలని రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం ఇంకా ఎవరికైనా రాకపోతే అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకున్న వారికి ఉచిత విద్యుత్ అందకపోతే ఆ కుటుంబాల పేర్లను కూడా రాసుకోండి రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించాం ఇంకా ఎవరికైనా రాకపోతే వారి పేర్లను కూడా నమోదు చేయండి వారికి కూడా అందిస్తాం అన్నారు రాష్టంలో ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం.

కల్పించాం.ఆడబిడ్డలు ఎవరైనా ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు డబ్బు అడిగితే కండక్టర్ డ్రైవర్ చెప్పండి మా రేవంత్ అన్నకు చెప్తాం చెప్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పండి అని అన్నారు.తెలంగాణలో కోటిమంది ఆడబడ్డలకి కోటి ఇందిరమ్మ చీరలను సారెగా అందించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీర అందాలి ఎవరికైనా అందకపోతే గ్రామ సర్పంచులు స్వయంగా వారి పేర్లను నమోదు చేసుకొని ప్రతి ఇంటికీ చీర అందేవిధంగా అధికారులకు ఆదేశాలిచ్చారు.ప్రతి తండాకు.

గ్రామానికి రోడ్లు,బడి,గుడి,ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన చదువులు,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడానికి కోడంగల్‌ను ఒక పెద్ద పారిశ్రామికవాడగా అభివృద్ధి చేసుకుంటున్నాం కోడంగల్‌ను దేశానికె ఒక మాడల్‌ నియోజకవర్గంగా.

తీర్చిదిద్దుతాం.నియోజకవర్గంలో జూనియర్‌,డిగ్రీ,అగ్రికల్చర్‌,మెడికల్‌ కాలేజీలతో పాటు సైనిక్ స్కూల్‌ ను ఏర్పాటు చేస్తున్నాం.మొత్తంగా 250 ఎకరాల్లో కోడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం.కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయము మేము కష్టాన్ని నమ్ముకున్నాం.కోడంగల్ నియోజకవర్గంలో 180 గ్రామ పంచాయతీల్లో ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలని.

అభినందించాలని,వారు తిరిగి గ్రామాలకు వెళ్లి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజా సేవ చేయాలని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం.తెలంగాణ రాష్ట్రానికి కోడంగల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నా అని కోడంగల్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోసినందునే ఈరోజు ముఖ్యమంత్రిని కాగలిగాను అని అన్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వాకిటి శ్రీహరి పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులు జిల్లా ప్రజాప్రతినిధులు,కొత్తగా ఎన్నికైన నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు,ఉపసర్పంచులు, వార్డుమెంబర్లతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు..

. #సూర్యమోహన్

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments