*గుంటూరు జిల్లా పోలీస్..
తాడేపల్లి పోలీస్ స్టేషన్…
ఆటో డ్రైవర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్… నడిరోడ్డుపై నడిపించిన తాడేపల్లి పోలీసులు,.//*_
పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 18(18.12.2025)వ తేదీ రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ థెరిసా కాలనీ సమీపంలోని అరటి తోటలో బ్రహ్మానందపురానికి చెందిన
ఆటో డ్రైవర్ ఇల్లచెరువు.వెంకటరావు (32) అనే వ్యక్తిని జన్మదిన వేడుక సందర్భంగా జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో మల్లినేని. సాయి భవాని అలియాస్ సాయి, వేమూరి మహేష్ బాబు అలియాస్ మహి దాడి చేసి సిమెంటు రాళ్లతో మోది హత్య చేయగా, ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి
సీఐ వీరేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్ట్ చేసినట్లు నిన్న(24.12.2025) జరిగిన మీడియా సమావేశంలో నార్త్ డిఎస్పీ మురళీ కృష్ణ గారు తెలిపారు.
తదనంతరం తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు గారి పర్యవేక్షణలో ఎస్సై కాజావలి గారి నేతృత్వంలోనీ ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది ఇద్దరు నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ నడిపిస్తూ, సమాజానికి నిందితుల ప్రవర్తన తెలియజేశారు.
ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నేరస్తులకు గట్టి హెచ్చరికలు చేసే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను రోడ్లపై నడిపిస్తూ ప్రదర్శన చేసినట్లు తెలిపారు.




