Home South Zone Andhra Pradesh దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు

దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు

0

తుమ్మలపల్లి

దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు

గతంలో రోడ్డు వెడల్పు కోసం తొలగించిన బస్ షెల్టర్కు తిరిగి *నూతన షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ గారి కుమారుడు కృష్ణమోహన్ .

ఈరోజు తుమ్మలపల్లి గ్రామంతో పాటు సుమారు చుట్టూ గ్రామాలు అయిన కొమరగిరిపట్నం, ఓడలరేవు, తుమ్మలపల్లి గ్రామంలో పేదలు అయిన వృద్దులు, వితంతవులు అయినవారికి ఈరోజు తుమ్మలపల్లి గ్రామంలో పుట్టిన డాక్టర్ పరమట నరసింహామూర్తి గారు మరియు వారి రెండవ కుమారుడు కృష్ణమోహన్ గారు ఈరోజు అందరికీ రగ్గులు (చలి కాలంలో కప్పుకునే దుప్పట్లు ) నేరుగా వారి ఇళ్లకు వెళ్లి నేరుగా వారికి ఇవ్వటం జరిగింది ఈ సందర్బంగా వారి

కుమారుడు కృష్ణ మోహన్అం మాట్లాడుతూ నాన్నగారు నరసింహామూర్తి గారి బాటలోనే నేను కూడా సేవా కార్యక్రమం లో పాల్గొవటం సంతోషం గా ఉందని అన్నారు. తుమ్మలపల్లి గ్రామానికి ఇప్పటివరకూ అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించమని భవిష్యత్తు లో కూడా గ్రామానికి కావలసిన అనేక అవసరాలకు తగ్గట్టు గా అందుబాటులో కి తేవడమే లక్ష్యం అని తెలిపారు త్వరలో నాన్నగారి పేరిట ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు దాని పేరు

Dr. PNM చారిటబుల్ ట్రస్టు* అని ఇక భవిష్యత్తే కార్యక్రమాలు ఆపేరుతో కోనసాగుతాయని కృష్ణమోహన్ తెలిపారు. అంతే కాకుండా గతంలో తుమ్మలపల్లి గ్రామంలో బస్ షెల్టర్ వారి తల్లితండ్రులు పేరిట నిర్మించిన బస్ షెల్టర్ రోడ్డు పెంపుదల సందర్బంగా తొలిగించిన ప్లేస్ లో మళ్ళీ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

ఈ షెల్టర్ నిర్మాణానికి సుమారు 3. 5 లక్షలు ఖర్చు. డాక్టర్ గారు గ్రామానికి ఎదో చెయ్యాలి అనే దృఢ సంకల్పం అయన వయసు కూడా తెలియనియదు. అందుకే గ్రామంలో యువత పదుల సంఖ్యలో కూడా అయన వెంటే ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమం లో కాట్రూ శాంతి కిరణ్.

మచ్చా సత్యనారాయణ, వుల్లూరి నాని, కుంచె రాజశేఖర్, యలమంచిలి రమేష్ బాబూ, మాకే లోకేష్, పోలామూరి శ్రీనివాస్, కుంచె మహేష్, నాతి సూర్యనారాయణ, పులుసుగంటి శ్రీనివాస్ లతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version