Home South Zone Telangana పేసా చట్టాన్ని బలోపేతం చేయాలి |

పేసా చట్టాన్ని బలోపేతం చేయాలి |

0

కొత్తగూడ,డిసెంబర్ 24(భారత్ అవాజ్)::పేసా చట్టం మహోత్సవన్ని పురస్కరించుకొని ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు సమావేశం మండలకేంద్రంలో జరిగింది.ఈ సమావేశలో ఆదివాసీ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకుడు మల్లెల రాము మాట్లాడుతూ…ఇటీవల తెలంగాణ రాష్ట్రం లో గ్రామ పంచాయితీ ఎలక్షన్స్ జరగగా మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో విడతల వారీగా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరిగాయి.

ఇటీవల నూతన సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ గ ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్పీకరం చేసి బాధ్యతలను స్పీకరించిన గ్రామ పంచాయతి పాలక మండలి సభ్యులకు ఆదివాసీ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. 5 వ షెడ్యూల్ ఏరియా లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1996 సంవత్సరం లో *పంచాయితీ రాజ్ ఎక్స్టెన్షన్ అఫ్ షెడ్యూల్ యాక్ట్-పేసా చట్టం-1996* చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ధ్వారా ఆదివాసీ గూడా లలో పేసా ఉపాధ్యక్షుడు కార్యదర్శి పేసా మొబలైజర్ ఉంటారు. గ్రామ సర్పంచ్ పేసా చైర్మన్ గా వ్యవహారిస్తారు.ఈ చట్టం ధ్వారా గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో స్వయం నిర్ణయధికారాన్ని కలిగి ఉంటారు.

భారత రాజ్యాంగం ధ్వారా నియామకం అయిన సర్పంచ్ లు గ్రామ పంచాయితీ ప్రథమ పౌరుడు/పౌరురాలు గ బాధ్యత కలిగి ఉండాలి. ఓటు వేసి ఎన్నుకున్న ఆదివాసీ ప్రజలకు జవాబు దారితనం గ ఉండాలని పేసా గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీ సమస్యలు ప్రజలందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని మినిట్స్ అర్ధం అయ్యే విధంగా పేసా రిజిస్టర్ ను కొనసాగించాలి.నూతన సర్పంచ్ లు ఏజెన్సీ మండలాలలో పేసా చట్టాన్ని బలోపేతం చేయాలి.ఏజెన్సీ చట్టాలు అయిన 1/59,1/79,LTR( భూ బదలాయింపు నిషేధ చట్టం) వడ్డీ వ్యాపార నిషేధ చట్టం-1960,పేసా చట్టం-1996,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉంటాయి.అధికారాన్ని అడ్డుపెట్టుకొని 5 వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంత చట్టాలను అగౌరవ పరిచే విధంగా వ్యవహారిస్తే *ఆదివాసి ప్రజా సంఘాలు* ఊరుకోరని హెచ్చరించారు.

పేసా చట్టం తీర్మాణం పార్లమెంట్ తో సమానం
ఆదివాసీ గ్రామలలో ఉండే దొర పటేళ్ళ తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పు తో సమానం అని పేసా చట్టం చెపుతుంది అని ఆదివాసీ యువకులు ప్రశ్నించడం నేర్చుకోవాలి.గిరిజన గూడల సమస్యలు లు తీర్చి గ్రామాలను అభివృద్ధి చెందించాలని నూతన సర్పంచ్ లు తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆదివాసీ ప్రజల భూ సమస్యలు,సాగు నీటి కష్టాలు, రోడ్లు, డ్రైనేజి మె… సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ మండలాలలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మహబూబాబాద్, ఇతర ప్రభుత్వ శాఖల యంత్రాంగనికి ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు ధనసరి రాజేష్ కుంజ నర్సింగ రావు, కల్తీ నరేష్ పూనేం సందీప్, ఈక నరేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version