సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్
విజయవాడ, డిసెంబర్ 25: ‘సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా గురువారం లోక్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన మాజీ ప్రధాన మంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, శ్రీ వాజ్‌పేయి గొప్ప వక్త, కవి మరియు సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుబడిన పరిపాలన దక్షకుడు అని అన్నారు. గ్రామాలను రహదారులకు అనుసంధానించే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానించే స్వర్ణ చతుర్భుజ్ ప్రాజెక్ట్ లాంటి అనేక సేవలను శ్రీ వాజ్‌పేయి దేశానికి అందించారని గవర్నర్ అన్నారు.
గవర్నర్ జాయింట్ సెక్రటరీ శ్రీ పి.ఎస్. సూర్య ప్రకాష్, లోక్ భవన్ అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






