Friday, December 26, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసుపరిపాలన దినోత్సవ బహిరంగ సభను ఎస్‌పీ వాకుల్ జిందాల్ పర్యవేక్షణ |

సుపరిపాలన దినోత్సవ బహిరంగ సభను ఎస్‌పీ వాకుల్ జిందాల్ పర్యవేక్షణ |

*గుంటూరు జిల్లా పోలీస్…*

“సుపరిపాలన దినోత్సవం” సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు,.//*

భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజీపేయి గారి జయంతిని పురస్కరించుకుని, తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటపాలెం గ్రామంలో ఆయన దేశానికి అందించిన సుపరిపాలనకు గుర్తుగా 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.

*ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా “సుపరిపాలన దినోత్సవం” పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో అటల్ బిహారీ వాజీపేయి గారి ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను కూడా ఆవిష్కరించారు.*
కార్యక్రమానికి విచ్చేసిన వీవీఐపీ, వీఐపీ అతిథుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సభా వేదిక వద్ద భద్రతా చర్యలు, వీవీఐపీ మరియు వీఐపీ మార్గాలు, సభా ప్రాంగణంలోకి ప్రవేశించే వ్యక్తుల నియంత్రణ మొదలగు పలు అంశాల గురించి సంబంధిత అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని స్థాయిల పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, సమాచార వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేలా పరస్పర సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు జిల్లా ఎస్పీలు శ్రీ ఎ.టి.వి. రవికుమార్ గారు (L&O), శ్రీ హనుమంతు గారు (AR), తుళ్లూరు డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు,తెనాలి డిఎస్పీ జనార్దన్ గారు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బీ సీఐ శ్రీ అలహరి శ్రీనివాస్ గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments