విజయవాడ
25-12-2025
ప్రచురణార్థం
క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
స్థానిక తారాపేటలోని సెయింట్ పీటర్స్ కో-క్యాతడ్రాల్ ఆర్ సియం చర్చ్ నందు గురువారం నాడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఫాదర్ దామాల విజయ్ కుమార్, సహాయ గురువు ఫాదర్ మణిహర్ ప్రత్యేక ప్రార్ధనలు చేసి ప్రభువు ఆశీర్వాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏసు ప్రభువు జన్మించిన రోజున క్రిస్మస్ పండు జరుపుకుంటారని ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఏసు ప్రభువు కృప కటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని ప్రజలందరికి మేలు జరగాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిలాలని కోరుకున్నారు.
ఏసు ప్రభువు అశీసులు దీవెనలు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి వారి పరివారానికి మంచి జరగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరంశెట్టి పూర్ణచంద్రరావు, గోదావరి గంగ తదితరులు పాల్గొన్నారు




