1930 దశకంలో గాంధీ మహాత్ముని పిలుపుమేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య తో పాటు స్వరాజ్యంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు ముప్పాళ్ళ అరుంధతి దేవి గురువారం తెల్లవారుజామున స్థానిక పలకలూరు రోడ్డు సత్య మౌంట్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ స్వగృహములో కన్నుమూశారు.
ఈ సందర్భంగా మనుమడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది కవిపురపు పట్టాభిరాముడు మాట్లాడుతూ విద్యావంతురాలైన అరుంధతి దేవి పెద్దబాలశిక్షతోపాటు రామాయణ భారత భాగవతాలను వల్లే వేసే వారిని చెప్పారు.
ఎనిమిది మంది సంతానంతో 15 మంది మనుమళ్లు మనవరాళ్లు15 మంది ముదిమనమలు, మనుమరాళ్లతో అరుంధతి దేవి సంపూర్ణ జీవితం గడిపారని పట్టాభిరాముడు తెలియజేశారు.




