216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్ల రూరల్, కర్లపాలెం, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి 216 పై ఉన్న బ్లాక్ స్పాట్స్ పరిశీలనలో భాగంగా బాపట్ల రూరల్ పరిధిలో హోలీ క్రాస్ హై స్కూల్ వద్ద బుధవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు.
బాపట్ల జిల్లా రోడ్ సేఫ్టీ అంశాన్ని ప్రథమంగా తీసుకొని ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.
నాయుడు,డిజిపి సూచనల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో జాతీయ రహదారి 216 నేషనల్ హైవే 16 ప్రమాదాల నివారణకు తీసుకోవలసినటువంటి చర్యలు అన్ని డిపార్ట్మెంట్ లతో కలిసి జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను పరిశీలిస్తున్నామని అన్నారు నో హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ వలన ప్రమాదలకు గల కారణాలు గుర్తించడం జరిగిందని అన్నారు. హెల్మెట్ లేకుండా జాతీయ రహదారి కి రాకూడదని నేషనల్ హైవే ఆనుకొని ఉన్న గ్రామాలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ హెవీ వెహికల్స్ మీద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో రోడ్డు సేఫ్టీ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో ఆగాహన కల్పించడం జరుగుతుందని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు .
#నరేంద్ర




