*గుంటూరు జిల్లా పోలీస్…
వాహనదారులు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ప్రమాదకరంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఆకతాయిలపై గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలను ప్రమాదకర రీతిలో నడుపుతూ, అధిక శబ్దాలు చేస్తూ వాహనదారులు మరియు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీస్ వారికి ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులపై గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ జివి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రోజు (24.12.2025) గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడమైంది.
ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు ముగిసిన అనంతరం విద్యార్థినులు, మహిళలు రహదారులపై ప్రయాణిస్తున్న సమయంలో, కొంతమంది ఆకతాయిలు ఆకస్మికంగా బ్రేకులు వేయడం, ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం, అతివేగంతో దూసుకెళ్లడం వంటి వికృత చర్యలకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేయడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, అనధికారికంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చిన ద్విచక్ర వాహనాలను గుర్తించి, పలువురు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, వాహనాలను సీజ్ చేయడం జరిగింది. *వివరాల ప్రకారం :* ▪️ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 17 ద్విచక్ర వాహనాలు ▪️ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 07 ద్విచక్ర వాహనాలు ▪️ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో – 20 ద్విచక్ర వాహనాలు మొత్తం 44 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది.
రోడ్లపై వికృత చేష్టలకు పాల్పడుతూ (ఈవ్ టీజింగ్), ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలు సీజ్ చేస్తామని, ఇలాంటి ప్రత్యేక వాహన తనిఖీలు ప్రతిరోజూ కొనసాగిస్తామని గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. చేపట్టిన పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలను ప్రమాదకర రీతిలో నడుపుతూ, అధిక శబ్దాలు చేస్తూ వాహనదారులు మరియు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీస్ వారికి ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులపై గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ జివి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రోజు (24.12.2025) గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడమైంది.
ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు ముగిసిన అనంతరం విద్యార్థినులు, మహిళలు రహదారులపై ప్రయాణిస్తున్న సమయంలో, కొంతమంది ఆకతాయిలు ఆకస్మికంగా బ్రేకులు వేయడం, ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం, అతివేగంతో దూసుకెళ్లడం వంటి వికృత చర్యలకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేయడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, అనధికారికంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చిన ద్విచక్ర వాహనాలను గుర్తించి, పలువురు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
వివరాల ప్రకారం :* ▪️ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 17 ద్విచక్ర వాహనాలు ▪️ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 07 ద్విచక్ర వాహనాలు ▪️ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో – 20 ద్విచక్ర వాహనాలు మొత్తం 44 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 👉 రోడ్లపై వికృత చేష్టలకు పాల్పడుతూ (ఈవ్ టీజింగ్), ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలు సీజ్ చేస్తామని, ఇలాంటి ప్రత్యేక వాహన తనిఖీలు ప్రతిరోజూ కొనసాగిస్తామని గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.