Friday, December 26, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరాజ్ కుమార్ ఆధ్వర్యంలో బెజవాడ బార్‌లో క్రిస్మస్ వేడుకలు |

రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బెజవాడ బార్‌లో క్రిస్మస్ వేడుకలు |

సినీ నటుడు రాజ్ కమార్ ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ లో ఘనంగా జరిగిన క్రిస్టమస్ వేడుకలు.

ది.25-12-2025 న క్రిస్టమస్ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ లో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు రాజకుమార్ గారు విచ్చేసి బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినీ జీవితంలో తన మొదటి సినిమా అయిన అమ్మ రాజీనామా అనే సినిమా ఈ విజయవాడలోనే షూటింగ్ జరిగిందని

27 సినిమాలలో హీరోగాను మొత్తం 74 సినిమాలలో నటించానని మరియు టీవీ మెగా సీరియల్స్ లో నటించానని, అనుకోకుండా విజయవాడ వచ్చి ప్రతిష్టాత్మకమైన బెజవాడ బార్ న్యాయవాదుల సమక్షంలో క్రిస్టమస్ పండగ జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని బెజవాడ బార్ నుండి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణగరు మరియు ప్రస్తుత సులసిటర్ జనరల్ శ్రీ కనకమేడుల రవీంద్ర గారు మరియు బెజవాడ బార్ లో సినీ నటులు కూడా ఎంతోమంది గొప్పవారు ఉన్న

ఈ బార్ అసోసియేషన్ లో నందు క్రిస్టమస్ పండగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తన ద్వితీయ కుమారుడు శ్రీ వేల్పుల ఆదిత్య సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేస్తున్నారని సభ్యులందరూ బెజవాడ బార్ సభ్యులందరూ తనను తన కొడుకును ఆశీర్వదించాలని అదేవిధంగా బెజవాడ బార్ సభ్యులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ప్రతినిధి ప్రముఖ న్యాయవాది శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ సినీ రంగంలో ప్రముఖ హీరోగా ఉంటూ కూడా తన కుమారుడని న్యాయవాద

వృత్తిలోకి తీసుకొని వచ్చి తన కొడుకు ద్వారా చట్టాన్ని కాపాడే బాధ్యత స్వీకరించిన సినీ హీరో రాజ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేసినారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అధ్యక్షులు శ్రీ ఎ కె బాష మాట్లాడుతూ మానవాళి కష్టాలను తీర్చడం కోసం క్రీస్తు మానవ రూపంలో బాల యేసుగా జన్మించిన క్రిస్టమస్ పండుగ రోజు సినీ నటుడు రాజ్ కుమార్ గారు విజయవాడ న్యాయవాదుల వద్దకు వచ్చి క్రిస్టమస్ కేకు కట్ చేసి పండుగను

జరుపుకోవడం అంతా ప్రభువు ఆశీస్సుల వల్లనే ఇంత ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నామని అదేవిధంగా క్రిస్టియన్ న్యాయవాదులందరూ ఏసుప్రభు ప్రబోధించినట్లు ప్రేమ కరుణ దయ మానవత్వంతో అందరినీ కలుపుకొని బెజవాడ బార్ కి వన్నె తెచ్చి జీసస్ మార్గంలో నడవాలని కోరినారు ఈ సందర్భంగా అనంతపురం న్యాయవాది

మరియు మాజీ ఉపాధ్యక్షులు అయినా ఆదిగారు, నందిగామ బార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆజాద్ గారు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎన్ బాల, జనరల్ సెక్రెటరీ కె.వి.రంగారావు గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీమతి రాజ్యలక్ష్మి పెండెం గారు ప్రముఖ న్యాయవాది షేక్ అనీఫ్, జాన్ విక్టర్

గారు మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments