పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు..
విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 37 వ వర్ధంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.. టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రదాంజలి ఘటించారు… కుల మతాలకు .
రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహనరంగా పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా పాటు పడ్డారని గుర్తు చేశారు.. రంగా ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి అని పేర్కొన్నారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అబ్దుల్ ఖాదర్, కూటమి కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, నరేంద్ర రాఘవ , కూటమి నాయకులు, .సుజనా .మిత్ర లు పాల్గొన్నారు…




