Home South Zone Andhra Pradesh కర్నూలు సీ క్యాంప్ రైతు బజార్ కి ఈ రోజు సెలవు !!

కర్నూలు సీ క్యాంప్ రైతు బజార్ కి ఈ రోజు సెలవు !!

0
0

కర్నూలు
నేడు కర్నూలు సీ క్యాంప్ రైతుబజారులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం :సి.క్యాంపు రైతుబజారులో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ, హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్ తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు కూరగాయలను అమ్మకానికి తీసుకురావద్దని వినియోగదారులు కూరగాయలు కొనడానికి రావద్దని వారు విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS