వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం
కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి కార్యక్రమం
మంగళగిరి
బడుగు, బలహీన వర్గాల నాయకుడు దివంగత స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని కాపు సంఘం నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి కాపు సంఘం నాయకులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహన రంగా చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు అండగా తాము నిలబడతామని తెలిపారు. జై కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాపు సంఘం మంగళగిరి
నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహా నాయకుడు అని తెలిపారు. పార్టీలకతీతంగా వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో, జనసేన నాయకులు అనిల్ బాబు, శివ నాగేంద్రం, నారిశెట్టి చంద్రశేఖర్, కాపు సంఘం నాయకులు తులం సాంబశివరావు, ఇండ్ల సత్యం, బత్తుల గణపతి, యుగంధర్, పోతన చిరంజీవి, నాగేశ్వరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.






