చీరాల: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు సందేశమైన ప్రేమ, శాంతి, సేవా భావం సమాజంలో అందరూ అనుసరించాల్సిన విలువలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి ప్రధాన పాస్టర్లు, సంఘ పెద్దలు, స్థానిక నాయకులు మరియు పెద్ద ఎత్తున క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.
#నరేంద్ర




