Home South Zone Andhra Pradesh ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా “ప్రజా దర్బార్”. |

ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా “ప్రజా దర్బార్”. |

0
1

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ గారు “ప్రజా దర్బార్ ” కార్యక్రమాన్ని నిర్వహించారు… ఈ ప్రజా దర్బార్‌కు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, తమ సమస్యలు, ఇబ్బందులను వినతిపత్రాలతో శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకువచ్చారు..

బాధితులు తమ సమస్యలను తెలియజేయగా ఆమె ప్రతీ ఒక్కరి సమస్యను ఓర్పుతో శ్రద్ధగా విని, సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ ద్వారా మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిస్కారం చూపడం జరిగింది..

తక్షణ పరిష్కారం సాధ్యం కాని కొన్ని సమస్యల విషయంలో కూడా ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని MLA గారు హామీ ఇవ్వడం జరిగింది.. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా MLA సత్యప్రభా గారు స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు..

#Dadala Babji

NO COMMENTS