కర్నూలు : బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు …జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ , ఐపియస్ ! * 2025 జనవరి నుండి డిసెంబర్ 20 వరకు ఒపెన్ డ్రింకింగ్ పై 17,089 కేసులు నమోదు.
ప్రజలకు అసౌకర్యం కల్గించే ఓపెన్ డ్రింకింగ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం పేర్కొన్నారు.బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, రోడ్లు, నడకదారులు, పార్కులు, వ్యాపార దుకాణ సముదాయాలు, శివారు ప్రాంతాలు మరియు వల్నరబుల్
ఏరియాలలో ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే వారి పై పబ్లిక్ న్యూసెన్స్ కింద చర్యలు తీసుకోవాలన్నారు.బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారి పై
జిల్లా వ్యాప్తంగా 2025 జనవరి నుండి డిసెంబర్ 20 వరకు ఒపెన్ డ్రింకింగ్ పై 17,089 కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ తెలిపారు.




