కర్నూలు :
జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రాంరెడి డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన
చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ్యని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కోరదాన్ని స్వాగతిస్తున్నామని తెలియజేశారు.
శుక్రవారం నంద్యాల పట్టణంలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలోఆయన మాట్లాడుతూ… ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన సుమారు 1,800 ఎకరాల విస్తీర్ణమైన భూమి అందుబాటులో ఉందని.
అలాగే కేసీ కెనాల్, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి వసతి కల్పించే పూర్తి అవకాశం ఉన్న ఈ ప్రాంతంలోనే ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి గతంలోనే ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.




