Friday, December 26, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి

సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి

ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.

రంగా గారి ఉద్యమ వారసులుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేశాం.

రంగా గారి వారసురాలిగా ఆశ కిరణ్ గారు ప్రజాపక్షం నిలవాలి.

జనసేన పార్టీ నాయకులకు వంగవీటి మోహన రంగా గారు అంటే గౌరవం లేదు.

వంగవీటి రాధా గారు నల్ల కళ్లద్దాలు తీస్తే పేద సామాన్య వర్గాల వారు కనబడతారు.

కూటమి ప్రభుత్వం రంగా గారి పేరు మీద స్మృతి వనం ఏర్పాటు చేయాలి. పోతిన వెంకట మహేష్

సితార సెంటర్ వద్ద వంగవీటి మోహన రంగా జంక్షన్ వద్ద రంగా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ మరియు టీం పోతన మహేష్ నాయకులు.
ప్రజల మాటలో ప్రజల బాటలో కలిచి నడిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ
ఎక్కడ సామాన్య వర్గాల ఇబ్బందులు ఉంటే అక్కడ బలమైన పోరాటం చేసిన నాయకులు వంగవీటి మోహన రంగా గారు .

వంగవీటి మోహన రంగా గారి ఉద్యమ వారసులుగా మేము అనేక పోరాటాలు చేసి పేద సామాన్య వర్గాలకు అండగా నిలుస్తున్నాం.
పోరాట స్ఫూర్తిని రంగా గారి నుండే తెలుసుకున్నాం.
కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వంగవీటి మోహన రంగా గారు పేరుమీద విజయవాడ నగరంలో ఒక స్మృతి వనం చిన్న జిల్లాకు పేరు మరియు ఒక పథకానికి ప్రకటించాలి.

రంగా గారి పేరును ఎన్నికలకు ముందు రాజకీయ ప్రచారస్రంగా వాడుకున్న కూటమి ప్రభుత్వం నేడు ఎందుకు వారి పేరు మీద జిల్లా పేరుగాని పథకం పేరుగానే ప్రకటించట్లేదని డిమాండ్ చేస్తున్నాం.

వంగవీటి ఆశా కిరణ్ గారు రంగా గారి వారసురాలుగా ప్రజా సేవకై బయటికి వచ్చారు వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ప్రజా సమస్యలపై ఆశా కిరణ్ గారు రంగా గారిలా స్పందించాలి
గొంతు లేని వారికి గొంతుకై .

మహిళా సమస్యలపై ప్రజా సమస్యలపై బలంగా స్పందించాలి. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకులు కరువు అవుతున్న నేటి రోజుల్లో ఆశాకిరణ్ గారి రాక మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.
రంగా గారి అడుగుజాడల్లో ఆశా కిరణ్ గారు నడవాలని కోరుకుంటున్నాం. బలమైన నాయకురాలుగా ఎదగాలని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

వంగవీటి మోహన రంగా గారు అంటే జనసేన పార్టీ వారికి గౌరవం లేదు గతంలో జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం నిర్వహించే సందర్భంలో రంగ గారి ఇంటి వద్ద ఆర్చ్ ను తీసి జనసేన పార్టీ ఆర్చ్ ని ఏర్పాటు చేశాం నేడు కృష్ణలంకలో రంగా గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ వాళ్లు బ్యానర్ తీసి రంగా గారి బ్యానర్ వెయ్యడానికి కూడా ఒప్పుకోలేదు అంటే అది కూడా కృష్ణలంక ప్రాంతంలో వారికి వంగవీటి కుటుంబంపై ఉన్న గౌరవం ఏ పార్టీతో అర్థమవుతుంది.

వంగ రాధాకృష్ణ గారు 2024 ఎన్నికల్లో కూటమి తరపున పశ్చిమ నియోజకవర్గంలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నాలుగు సార్లు ప్రచారం చేశారు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 42 ప్లాట్ల అంశంలో ఎస్కేపి అపార్ట్మెంట్స్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యజమానులు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు. వంగవీటి మోహన రంగా గారి ఆశయాల కోసం పనిచేయాలని చెబుతున్న రాధాకృష్ణ గారు పేద సామాన్య వర్గాలు ఇబ్బంది.

పడుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు. ఇకనుంచి అయినా మీ నల్ల కళ్ళద్దాలు తీసేయండి అప్పుడు మీ కళ్ళకు అగ్ర వర్ణాల వారు పెట్టుబడిదారులో వైట్ కాలర్ నేరస్థులు కనబడటం తగ్గి పేద సామాన్య వర్గాల వారు కనబడతారు అప్పుడు మీరు పేద సామాన్య వర్గాల సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం అవుతారు. ఈ కార్యక్రమంలో దొడ్ల హేమంత్ పైడిపాటి మురళి పైడిపాటి రమేష్ షేక్ షాహీనా నాగోతి గిరీష్ పొట్నూరి
శీను పోతిన సాంబ తవ్వ మారుతి వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు వడ్లని శ్యామ్ తమ్మిన రఘు బాబు ,సింగంశెట్టి రాము ,మొలకల హనుమాన్ ,సుకాసి భాను ,పిల్ల రవి ,సాబింకర్ నరేష్ సోమ్ మహేష్ , కోరగంజి సాంబ ,పిల్ల నాగరాజు ,పైలా రోహిత్ ,నాగోతి కిషోర్ ,పిల్ల దీపు ,చింతాడ నాని ,లండా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments