సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి భవనం 48వ డివిజన్లో విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారి తో కేక్ కటింగ్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు కామ్రేడ్ బెవర శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ
100 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పార్టీ నేతలు ఉద్యమాలలో అసువులు బాసినారు ఈ పశ్చిమ నియోజకవర్గం లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఉప్పలపాటి రామచంద్ర రాజు గారు కాకర్లపూడి సుబ్బరాజు గారు నాజర్ వలి గారు ఎంతోమంది సేవలు అందించారు కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా ఉండేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్నాయి
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి డివి రమణ బాబు నగర నాయకులు చీర్ల రామస్వామి కార్యదర్శి కరోతి వెంకటేశ్వరరావు ఎస్వీ రమణ తొత్తడి స్వామి నాయుడు కొరికాన నీలం నాయుడు కునిగంటి సత్యనారాయణ చింతాడ కనకారావు కొరికాన రామినాయుడు మండపాక శ్రీను తొత్తడి రమణ బాబు పి నాగరాజు బి దుర్గా కార్యకర్తలు పాల్గొన్నారు🚩🚩🚩




