Home South Zone Andhra Pradesh అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు…..

అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు…..

0
0

అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష అన్నారు.

కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం పెదగోళ్లపాలెంలోని  నిరుపేద కుటుంబంకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాష 10 కేజీల బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాష మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం .

నిత్యావసర సరుకులు ,దుప్పట్లు ,అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు,సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుభాని, పమిడి రవి,షేక్ ఇబ్రహీం,షేక్ బహదూర్ బాష , తదితరులు పాల్గొన్నారు

#నరేంద్ర

NO COMMENTS