ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనా నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ రోజు ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కల్యాణము మరియు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అర్చన పూజలు నిర్వహించారు, స్వామి వారి కార్యక్రమమును మహామఁడపము 7 వ అఁతస్తు నఁదు ఏర్పాటు చేసిన పూజను తిలకిఁచిన భక్తులు స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
ఆలయ కార్య నిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజలు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని అన్నారు. వివాహం మరియు సంతానం: వివాహం లేదా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రేయస్సు: మంచి ఆరోగ్యం.
విజయం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని భక్తులు స్వామి వారి ఆశీస్సులు పొందడానికి నెలకు ఒకసారి జరిగే సేవలొ అనగాఈ పూజలో ఉభయ రుసుము రూ.1,116/- ల టిక్కెట్టు పై శ్రీ స్వామి వారి సేవలొ పాల్గొనడం ఎంతో మంచిదని సూచించారు.
ఈ పూజా కార్యక్రమం ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆలయ అర్చకులు మరియు సిబ్బంది సహకారంతో విశేషముగా పూజ కార్యక్రమము జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.




