హైదరాబాద్ : ఎమ్మెల్సీ కేసు పెండింగ్‌లో ఉండగా, కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్న అజారుద్దీన్ మంత్రి పదవి.
కాంగ్రెస్ ప్రభుత్వం అమీర్ అలీ ఖాన్, కోదండరాంలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా, వారి పదవులను రద్దు చేసిన సుప్రీంకోర్టు.
ఈ నేపథ్యంలో అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి, మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసేందుకు నివేదిక పంపిన తెలంగాణ ప్రభుత్వం.
ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వగా, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోగా ఏదైనా ఒక పదవిలో (ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే) ఎన్నిక అవ్వాల్సిన అవసరం ఉందని తెలుపుతున్న రాజకీయ నిపుణులు.
అయితే వచ్చే ఏడాది నవంబర్ నెల వరకు ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అయ్యే అవకాశం లేనందున, అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.
#Sidhumaroju




