మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే
నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ
గండాలయ పేటలో కార్డెన్ సెర్చ్
సరియైన ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మంగళగిరి
మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారం అవుతాయని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ అన్నారు. గుంటూరు రేంజి ఐజిపి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ పరిధిలో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా శనివారం ఉదయం నగరంలోని గండాలయ పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణా విక్రయాలు, వినియోగంపై తమకు గానీ, 1972 కు సమాచారాన్ని అందిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
డ్రగ్స్ పై ప్రజల్లో చైతన్యం కలిగించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ సీఐలు వీరాస్వామి.
బ్రహ్మం తో పాటు పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా.రు




