*గుంటూరు జిల్లా పోలీస్…
సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న / దొంగిలించబడిన సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు,.//*_ పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన సెల్‌ఫోన్లను రికవరీ చేసి, ఉచితంగా బాధితులకు అందజేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు.
ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్ల 53 లక్షల విలువైన మొత్తం 3,769 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. • సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. 👉 ఈ రోజు (26.12.2025) గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న / దొంగిలించబడిన సెల్‌ఫోన్లను గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తించి సంబంధిత బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 8688831574, లేదా CEIR వెబ్‌సైట్, లేదా జిల్లా సైబర్ సెల్, లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
నేటి రోజుల్లో సెల్‌ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అధిక లాభాలు, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు వంటి ఆశలు చూపుతూ ప్రజలను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతాల నుండి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే వాటిని బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో గానీ, లేదా జాతీయ సైబర్ భద్రత టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సెల్‌ఫోన్ల రికవరీలో విశేషంగా కృషి చేసిన ఐటీ కోర్ సీఐ శ్రీ నిషార్ భాష గారు, కానిస్టేబుళ్లు శ్రీధర్ గారు, మానస గారు, ఇమామ్ గారు, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ గారు, కానిస్టేబుల్ కరీముల్లా గారులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.






