బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం….
బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025 పోటీలలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముంబై నుంచి 37 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం కోఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు బాప్ప రైల్వే స్టేషన్లో వీరికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం వీరికి ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాలలో జిల్లేళ్ళమూడి గ్రామంలో పోటీలు జరిగే విశ్వ జనని పరిషత్ ప్రాంగణానికి వీరిని తరలించారు.
#నరేంద్ర




