మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!
మరోసారి ప్రవేశరుసుం చెల్లించిన మంత్రి నారా లోకేష్
ధన్యవాదాలు తెలిపిన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు
మంగళగిరి, డిసెంబరు 27: మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ గారు ఎకోపార్కు వాకర్స్ కు మరోసారి శుభవార్త అందించారు. మంగళగిరి ఎకోపార్కులో ఉదయం 6నుంచి 9గంటల వరకు వాకింగ్ కు విచ్చేసేవారికి ఉచిత ప్రవేశం కల్పించేందుకుగాను 2026 సంవత్సరానికి గానూ
మంత్రి నారా లోకేష్ గారు తన సొంత నిధులు చెల్లించారు. మంగళగిరి ఎకోపార్కు నిర్వహణ నిమిత్తం అటవీశాఖవారు ఎకోపార్కు సందర్శకులకు ప్రవేశ రుసుం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాకర్స్ ప్రతినిధులు వాకింగ్ నిమిత్తం ఏకోపార్కులో ఉదయం 6గంటలనుంచి 9గంటల వరకు ఉచిత ప్రవేశం కల్పించాలని గతంలో
మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం ఉచిత ప్రవేశం కల్పించడం వీలుకాకపోవడంతో లోకేష్ గారు పెద్దమనస్సుతో తన సొంత నిధులు సుమారు 5లక్షలకు పైగా డిపార్ట్ మెంట్ కు చెల్లించారు. దీంతో 2025 సంవత్సరానికిగానూ ఎకోపార్కులో ఉదయం 6నుంచి 9గంటల వరకు వాకర్స్ కు ఉచితప్రవేశం కల్పించడం జరిగింది.
మళ్లీ నూతన సంవత్సరం 2026కు సంబంధించి ప్రవేశ రుసుం చెల్లించాల్సివుంది. ఈ క్రమంలో మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు తదితర ప్రతినిధులు డాక్టర్ ఎమ్మెస్సెస్ భవన్ కు ఇటీవల వెళ్లి మంత్రి నారా లోకేష్ గారి ప్రతినిధులను కలసి విషయాన్ని తెలియజేయడమైంది. వారి ద్వారా మంత్రి లోకేష్ గారి దృష్టికి సమాచారం వెళ్లడం.
వెనువెంటనే 2026 సంవత్సరానికిగానూ రూ.5లక్షలు డిపార్ట్ మెంట్ కు చెల్లించేందుకుగాను తన సొంత నిధులను మరోసారి వాకర్స్ కోసం చెల్లించారు. మంగళగిరి ఎకోపార్కులో వాకర్స్ ప్రవేశ రుసుం వచ్చే సంవత్సరానికి… అంటే 2026 సంవత్సరానికి కూడా మంత్రి నారా లోకేష్ గారు చెల్లించడం పట్ల మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు, కార్యదర్శి గోలి బాలమోహన్
కోశాధికారి తిరువీధుల నరసింహమూర్తి సంతోషం వ్యక్తంచేశారు. వాకర్స్ తరఫున మంత్రి నారా లోకేష్ గారికి వారు ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిరోజూ ఉదయం కొంతసేపు వాకింగ్ చేస్తే ప్రయోజనకరంగా వుంటుంది. మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు వాకర్స్ తరఫున తన సొంతనిధులు చెల్లించడం గొప్ప విషయమని, ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తిచేసింది.




