*విజయవాడ
దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత
దుర్గగుడికి విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లు
విద్యుత్ సరఫరా నిలిపేసిన ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) అధికారులు
2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని చెబుతున్న విద్యుత్ శాఖ
బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా టెంపుల్ అధికారులు నుంచి రాని స్పందన
హెచ్‌టీ లైన్ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు ప్రకటించిన విద్యుత్ అధికారులు
విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు
సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్న అధికారులు
ఉత్పత్తి అయిన విద్యుత్‌ను APCPDCL నమోదు చేయలేదని అంటున్న దేవస్థానం అధికారులు




