ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే భారీ ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే.. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తోంది అనేందుకు ఇదో ఉదాహరణగా మిగలనుంది. అదేంటో చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందింస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో జారీచేసిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి ఇవ్వనుంది. ఈ కొత్త పాస్ బుక్స్‌పై రాష్ట్ర రాజముద్ర (ఎంబ్లమ్) ఉంటుంది. అంతేకాకుండా, క్యూఆర్ కోడ్ కూడా ముద్రించి ఉంటుంది.
దాన్ని స్కాన్ చెయ్యడం ద్వారా రైతులు తమ భూమి వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని, భూమి రికార్డులను సరిచేస్తూ ముందుకు వెళుతోంది.




