Saturday, December 27, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగంజాయి రహిత జిల్లాగా గుంటూరు : ఎస్పీ వాకుల్ జిందల్ |

గంజాయి రహిత జిల్లాగా గుంటూరు : ఎస్పీ వాకుల్ జిందల్ |

గుంటూరు జిల్లా పోలీస్…

/గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు. – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు,. నిషేధిత గంజాయి వినియోగం, విక్రయం మరియు సరఫరాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ వారు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గంజాయి వాడుతున్న వ్యక్తులు ఎక్కడి నుంచి గంజాయిని తీసుకువస్తున్నారు, వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎలాంటి నెట్‌వర్క్ ద్వారా అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న అంశాలపై లోతైన సమాచారాన్ని సేకరించి, సంబంధిత వారందరినీ నిందితులుగా గుర్తిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.

పోలీస్ అధికారులు ఈ సంవత్సరంలో గత మూడు నెలల (అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025) కాలంలోనే 218 మంది నిందితులపై 38 కేసులు నమోదు చేసి, 164 మందిని అరెస్ట్ చేసి, సుమారు 65 కేజీల ఘన గంజాయిని మరియు 150 గ్రాముల ద్రవ గంజాయిని, 28 గ్రాముల MDMA, 05 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

గంజాయి కేసుల్లోని నిందితులకు న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షలు పడే విధంగా పోలీస్ అధికారులు గత మూడు నెలలు అనగా అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 రెండు కేసుల్లో ఐదుగురు నిందితులకు జైలు శిక్షలు మరియు జరిమానాలు శిక్షలుగా న్యాయస్థానాల వారు విధించారు.

గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తుల వివరాలను ప్రత్యేకంగా సేకరించి, గతంలో గంజాయి కేసుల్లో అరెస్టైన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తూ, వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రతివారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, మళ్లీ మాదక ద్రవ్యాల వైపు దృష్టి మరలకుండా అవగాహన కల్పిస్తున్నారు.  ఈ సంవత్సరంలో పలు గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటూ, వివిధ కేసుల్లో అరెస్టయిన నేరస్తులను గుర్తించి, వారిలో 07 మందిని PD చట్టం క్రింద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.అలాగే PIT NDPS చట్టం క్రింద 11 మందిపై చర్యలు తెసుకోవలసినదిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినారు.భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కూడా ఇదే విధంగా కఠిన చర్యలు తప్పవని స్పస్టం చేశారు.

సంకల్పం కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లాలోని కాలేజీలు, పాఠశాలలలోని విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.  గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక నష్టాలపై యువకులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, పాంప్లెట్లు పంపిణీ చేయడం చేస్తున్నారు.

ఆటోలలో అనౌన్స్మెంట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లో పరిధిలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే నష్టాలు గురించి పోలీసుల ద్వారా ప్రచారం చేయడం జరుగుతున్నది.  వివిధ ప్రాంతాలలోని ప్రధాన కూడళ్ళు, జంక్షన్లు, జన సంచారం కలిగిన ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఆడియో, వీడియోల ద్వారా ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాల పట్ల విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం డ్రోన్ గస్తీ నిర్వహిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాళీ మరియు నిర్మానుష్య ప్రదేశాలలో, పాడుబడిన గృహాలు, భవనాలలో, గుబురు చెట్లు మధ్యలలో ఎవరైనా గంజాయి సేవిస్తూ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ప్రతిరోజు ఎన్ఫోర్స్ మెంట్ నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకా బంధీ, కార్డాన్ అండ్ సెర్చ్ మరియు ప్రత్యేక సంచార ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల నివాసాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు, వ్యక్తుల వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించడం జరిగింది.
ఈ కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలిస్తున్న గౌరవ జిల్లా ఎస్పీ గారు స్థానిక ప్రజలతో సంభాషిస్తూ గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలు, వ్యక్తిగత జీవితం మరియు కుటుంబాలపై దాని ప్రభావం, చట్టపరంగా ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తున్నారు.గత రెండు రోజులుగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలోని పలు ప్రాంతాల్లో ఈ కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆ వివరాలు…*
1) గుంటూరు వెస్ట్ పోలీస్ సబ్ డివిజన్, నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీ 1వ లైనులో ఈ ఆపరేషన్ నిర్వహించి, 07 మంది రౌడీ షీటర్లను చెక్ చేసి, సరైన ధ్రువ పత్రాలు లేని 29 ద్విచక్రవాహనాలు, 01 ఆటోను సీజ్ చేయడం జరిగింది.
2) గుంటూరు సౌత్ పోలీస్ సబ్ డివిజన్, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణ భారతి నగర్ 10 నుండి 26వ లైన్ల వరకు ఈ ఆపరేషన్ నిర్వహించి, 06 మంది రౌడీ షీటర్లకు, 05 మంది గంజాయి అమ్మే నేరస్తులకు మరియు ఇద్దరు సస్పెక్ట్ షీటర్లకు, కౌన్సెలింగ్ నిర్వహించి, సరైన ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలను, 09 ఆటోలను సీజ్ చేయడం జరిగింది.
3) గుంటూరు ఈస్ట్ పోలీస్ సబ్ డివిజన్, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఈ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు రౌడీ షీటర్లకి, ఒక సస్పెక్ట్ షీటర్ కి కౌన్సెలింగ్ నిర్వహించి, సరైన ధ్రువ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
4)గుంటూరు నార్త్ పోలీస్ సబ్ డివిజన్, మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండాలయ పేట నందు ఈ ఆపరేషన్ నిర్వహించి, 4 మంది రౌడీ షీటర్లు, 5 మంది సస్పెక్ట్ షీటర్లు, ఇద్దరు గంజాయి అమ్మే నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, సరైన వాహన ధ్రువ పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా…..* * ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న రౌడీషీటర్లను చెక్ చేసి, వారి ప్రవర్తన, జీవన విధానం గురించి ప్రజలందరి ముందు విచారణ చేసి వారు సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. * గంజాయి వలన యువత జీవితం ఎలా నాశనం అవుతుందో, సమాజంపై దాని ప్రభావం ఏవిధంగా ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పించారు. * గంజాయి వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణా సంబంధిత సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. * ఈ ప్రత్యేక డ్రైవ్‌లలో ‘త్రినేత్ర’ (Trinetra), మొబైల్ స్కానింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి అనుమానితుల వేలిముద్రలు, వాహనాల వివరాలను పరిశీలించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments