ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు.
ఆంధ్ర రత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రిగా, చంద్రబాబు రెండవ సారి ముఖ్యమంత్రిగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా వారి పదవీకాలంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు అలాగే ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు.
టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం నగరంలో స్థానిక పోలీస్ అధికారులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి స్వచ్ఛంధ పదవీ విరమణ చేసేలా కుట్రలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
ఇంట్లో వ్యక్తికి క్యాన్సర్ వస్తే, పది వేల జీతగాళ్ల కుటుంబం కూడా లక్షల రూపాయలు అప్పు చేసైనా కాపాడుకొనే ప్రయత్నం చేసేంత జ్ఞానం మోదీ, చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లకు లేదని ఆయన దుయ్యబట్టారు. విశాఖ సభలో రాహుల్ గాంధీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిధులతో నిలబెడతామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే నిలబడతారనీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే విశాఖ ఉక్కు సంస్థను ఆదుకుంటామనే హామీ నెరవేరుస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.
మూడేళ్లలో రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 25 లోక్ సభ సీట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
చంద్రబాబు, జగన్ విభజనకు మద్దతు ప్రకటించినా
ఆంధ్రప్రదేశ్ తెలంగాన ఉమ్మడిగానే ఉండాలని పోరాడినవాడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మాట్లాడే హక్కు తనకు మాత్రమే ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేసారు.






