గుంటూరులో అర్ధరాత్రి సమయంలో యువకులు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చితకబాదారు. లక్ష్మీపురం నాయర్ హోటల్ సెంటర్ లో అర్ధరాత్రి సమయంలో మెయిన్ రోడ్డుపై ఒక యువకుడిని కొంతమంది మధ్య గొడవ జరిగింది దీంతో యువకులు అందరూ కలిసి నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టారు.
కింద పడిన వదలకుండా కొట్టారు నడిరోడ్డుపై జరిగిన ఘటనతో జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన ప్రదేశానికి చేరుకోగానే యువకులు అక్కడ నుండి పరారీ అయ్యారు దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వీరంగం సృష్టించిన యువకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఈ అర్ధరాత్రి హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
