చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి కామిశెట్టి నగేష్ రూ. 15 వేలు విలువైన టెక్సమో మోటార్‌ను విద్యార్థుల సౌకర్యం కోసం అందజేశారు.
తాను చదువుకున్న పాఠశాలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమ సుధాకర్, ఉపాధ్యాయ బృందం, విశ్రాంత ఉపాధ్యాయులు జ్యోతిశ్వరుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




