కర్నూలు : బేతంచర్ల : RS రంగాపురం : డోన్:
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం
శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులతో చర్చించారు.




